తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇచ్చారు. ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు బస్సు డిపోను కేటాయించాలని కోరారు పాల్వాయి హరీశ్ బాబు. అలాగే చాలా వరకూ రోడ్లు మరమ్మతులు చేయలేదు… బస్సు సర్వీసులను తిరిగి తొందరగా మొదలు పెట్టాలని కోరుతున్నాం అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
ఆర్టీసీ బస్సులు చెన్నూరుకు ఎక్కువ కేటాయించాలని…చాలా వరకూ రోడ్లు మరమ్మతులు చేయలేదు అన్నారు. బస్సు సర్వీసులను తిరిగి తొందరగా మొదలు పెట్టాలని కోరుతున్నాం…ఆర్టీసీ బస్సులు చెన్నూరుకు ఎక్కువ కేటాయించాలన్నారు.
దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్…డిపోలకు బస్సులు ఇవ్వాలన్న విజ్ఞప్తులన్నీ త్వరలో నెరవేరుస్తాం అన్నారు. కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నాం అన్నారు.
Also Read:TTD: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు