ఎన్యుమరేటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు: పొన్నం

1
- Advertisement -

ఎన్యుమరేటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించున్న అనంతరం మాట్లాడిన పొన్నం… ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామని తెలిపారు.

ఇష్టముంటేనే కులం, ఆధార్‌, పాన్‌ వివరాలు చెప్పొచ్చన్నారు. వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్ల విధులకు ఆటకం కలిగిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటింటి సర్వే నిర్వహణను ప్రకటించింది. మొత్తంగా 75 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించింది. సర్వేలో మహిళనే గృహ యజమానిగా గౌరవిస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేపై తీవ్ర వ్యతిరేకతతోపాటు, ప్రజానీకంలో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -