సమీకృత సమగ్ర వ్యవసాయ క్షేత్రాలతో ఉపాధితో పాటు రైతులకు అదాయం లభిస్తుందని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జర్మనీ పర్యటనలో భాగంగా గురువారం బెర్లిన్ సమీపంలో సమగ్ర సేంద్రీయ సమీకృత వ్యవసాయ క్షేత్రం సందర్శించింది సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి ..వ్యాపార కేంద్రాల (మాల్స్) తరహాలో వ్యవసాయ క్షేత్రాలు.. ఒకే చోట అన్ని రకాల కూరగాయలు, ఇతర ఆహార పదార్ధాలు, మేక, ఆవుపాలు లభిస్తాయన్నారు.
వ్యవసాయ క్షేత్రం వద్దే విక్రయశాల ఉండటంతో రైతుతో పాటు 136 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. తెలంగాణలో పంటకాలనీలతో పాటు ఈ తరహా వ్యవసాయ క్షేత్రాలకు ప్రోత్సాహం ఇస్తే మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని… సేంద్రీయ వ్యవసాయానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు , విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఉన్నారు.