కరెంట్ షాక్‌తో కాంగ్రెస్ విలవిలలాడుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ,రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..కరెంటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయంగా, రాష్ట్రాల వారీగా ఒక విధానం అంటూ ఉన్నదా ? అని ప్రశ్నించారు. తప్పులు మాట్లాడి సరిదిద్దుకోకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున తప్పులు మాట్లాడితే సరిదిద్దుకోవాలి కానీ ఎదురుదాడికి దిగడం పద్దతికాదు .. తెలంగాణ రైతాంగం క్షమించదన్నారు.
ప్రభుత్వం యొక్క లోపాలపై విమర్శించాలంటే ఆయా రంగాలపై అధ్యయనం చేసి ఆరోపణలు చేయాలన్నారు. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నది.. రైతుకు ఎదురువచ్చి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు.రూ.72 వేట కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించి చేయూతనిచ్చింది తెలంగాణ అన్నారు.ఒకనాడు కరంటు లేక, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగిన దుస్థితి తెలంగాణ రైతులది….కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అలాంటి సమస్యలు లేవు .. తెలంగాణ రైతాంగం దీనిని గమనించి బుద్దిచెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ముందుకు తీసుకుపోవడంలో ఒక దార్శనికత ఉన్నదా ? ఒక ఆలోచన ఉన్నదా ? పార్టీలో మనిషికో మాట మాట్లాడతారని…తెలంగాణ కోసం కోట్ల మంది ఎదురుచూస్తుంటే, లక్షలాది మంది ఉద్యమిస్తుంటే, వందలమంది బలిదానాలు చేస్తుంటే తెలంగాణ అంటే దోశనా, కాఫీనా, పెసరట్టా అంటూ పరాష్కాలు ఆడారన్నారు.తెలంగాణ ఆత్మ, ఆలోచన పట్టని పార్టీ కాంగ్రెస్ అని…అధికారం కోసం తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆలోచించలేదు.. దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ పాలన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది విద్రోహ పాత్ర…తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ గొప్పదనం కాదు అన్నారు.
Also Read:‘నాయకుడు’ గొప్ప ఆనందాన్నిచ్చింది: కీర్తి సురేష్
తెలంగాణ ఇచ్చామని చెప్పడంలోనే కాంగ్రెస్ అహంకారం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రజల హక్కు అని…కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయాలన్నా ఢిల్లీలో స్విచ్ నొక్కాలి .. బీఆర్ఎస్ పార్టీ ఆత్మ తెలంగాణ రాష్ట్రం అన్నారు.కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ఉపాధి సంక్షోభంలో పడ్డాయని…కరంటు కష్టాలు, సాగునీటి కష్టాల నుండి పుట్టుకువచ్చిందే తెలంగాణ ఉద్యమం అన్నారు.శాసనసభ ఉప సభాపతిగా ఉన్నప్పుడే కేసీఆర్ కరంటు ఛార్జీల పెంపు తెలంగాణను బొందపెట్టడమే అని ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తుచేశారు.తెలంగాణలో 24 గంటల కరంటు, వ్యవసాయానికి ఉచిత కరంటు కొనసాగుతుంది .. దీనిని కాపాడుకోవడం రైతాంగం బాధ్యత అన్నారు.
Also Read:విండీస్‌పై భారత్ గెలుపు