ఆహారపు ఉత్పత్తులలో తెలంగాణ టాప్‌: నిరంజన్‌ రెడ్డి

473
minister
- Advertisement -

ఆహారపు ఉత్పత్తులలో తెలంగాణ అగ్రస్ధానంలో ఉందని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరం హోటల్ క్రౌన్ ప్లాజా లో డచ్ ట్రేడ్ మిషన్ పెట్టుబడి దారుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన నిరంజన్ రెడ్డి … గడిచిన కొన్నేళ్లలో యూరప్ మరియు భారత్ ల మధ్య ఎగుమతులలో 72% వృద్ది ఉందన్నారు.

యూరోపియన్ వాణిజ్యం లో 2.3% వాటాను కలిగిన 9వ అతిపెద్ద భాగస్వామి భారత్ అన్నారు. భారత్, యూరప్‌ల మధ్య వర్తకం విలువ 2010 లో 23 బిలియన్ లు కాగా, 2016 కు అది 29 బిలియన్ లకు చేరుకుంది అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ ముఖ్య దేశం అని భారత్ లో యూరప్ కంపెనీల పెట్టుబడులు మరియు వాణిజ్య సంబందాల విషయం లో యూరప్ పటిష్టమైన, పారదర్శకమైన విధానాలను, వ్యాపార వాతావరణాన్ని ఆవలంబిస్తుందన్నారు.

niranjan reddy

ఇది భారత్ మరియు యూరప్ ల మద్య ద్విముఖ వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని… రాష్ట్రం లో విత్తన మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అభివృద్ది పట్ల సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు.

పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు, విత్తన ఉత్పత్తి రంగానికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో పద్దతిలో సులభతరంగా 15 నుంచి 30 రోజులలోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.

ఐటీ ఎగుమతులలో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని….వ్యవసాయ రంగ అభివృద్దికి అమలుచేస్తున్న పథకాలు పెట్టుబడి దారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. తెలంగాణలో విత్తన పరిశ్రమ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం అన్నారు.

niranjan reddy

వరి, మొక్కజొన్న, బత్తాయి, మామిడి, జామ, బొప్పాయి, దానిమ్మ, చెరుకు, టొమాటో, ఉల్లిగడ్డ, క్యారెట్, చింత, మిరప, పసుపు లాంటి ఆహారపు ఉత్పత్తులు అధిక మొత్తంలో తెలంగాణాలో పండుతాయని…రాష్ట్రంలో విత్తనోత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

వ్యవసాయ ఆదారిత రాష్ట్రం అయిన తెలంగాణలో 60% మంది వ్యవసాయపై ఆధారపడి జీవిస్తున్నారు… రాష్ట్రం లో సారవంతమైన నేలలు, వైవిధ్యమైన పంటల సాగు , మంచి సాగునీటి వనరులు ఉన్నాయని చెప్పారు. ఏడాది పొడవునా మంచి వాతావరణ పరిస్థితులు వ్యవసాయ పరిశోదనకు, పంటల సాగుకు, విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉంటాయన్నారు.

niranjan reddy

- Advertisement -