రైతు కళ్లలో ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కృష్ణా నది నీళ్లతో ఖాన్ చెరువు నింపాలని దీక్షతో పనిచేశాం…-రాబోయే రోజులలో ఖాన్ చెరువుకు ఇక కరువుండదన్నారు. జూరాల నిండితే ఖాన్ చెరువు నిండినట్లే .. 1500 ఎకరాలకు సాగునీరు అందుబాటులో కి వస్తుందన్నారు.
రూ.79 లక్షలతో లిఫ్ట్ ఏర్పాటు చేశాం .. గ్రామస్తులు కమిటీగా ఏర్పడి దీనిని జాగ్రత్తగా నడుపుకోవాలి.చెరువుకింద పంటలు పండిన తరువాత రైతులు గ్రామ దేవతల పేరు మీద అన్నదానం నిర్వహించండన్నారు. లిఫ్ట్ నిర్మాణానికి సహకరించిన, పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన నిరంజన్ రెడ్డి… రైతులు సాంప్రదాయ పంటలు విడిచిపెట్టాలన్నారు.
తెలంగాణలో కొన్ని సీజన్లలో కొత్తిమీర, పుదీన, టమాట, మిరపకాయ్ వంటివి దొరకడం లేదన్నారు. ఎండాకాలం, వానాకాలంలలో రెండు పంటలపై మాత్రమే రైతులు ఆధారపడొద్దు… ఉచిత కరంటు ఇస్తున్నాం .. సాగునీరు వస్తుందన్నారు. ఏడాదికి నాలుగు పంటలు తీసే అవకాశం ఉంది…నూతన వ్యవసాయ ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేస్తాం అన్నారు.
పెద్దగూడెం లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి ఖాన్ చెరువుకు చేరిన నీటితో గ్రామంలోని కోదండరామస్వామికి అభిషేకం నిర్వహించి సతీమనితో కలిసి మొక్కు తీర్చుకున్నారు నిరంజన్ రెడ్డి. అనంతరం మెంటెపల్లి గ్రామ పరిధిలోని రాఘవేంద్రనగర్ లిఫ్ట్ ను ప్రారంభించి 50 ఎకరాలకు నీళ్లందించే రాసాలకుంటలో కృష్ణానీళ్లకు పూజచేశారు.