తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం:నిరంజన్ రెడ్డి

171
niranjan reddy
- Advertisement -

సరళా సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు ద్వారా రెండు పంటలకు నీరు ఇస్తాం అని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళా సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో జల పూజ చేశారు నిరంజన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,కలెక్టర్ యస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

కట్ట నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి వానాకాలం పంటకు నీరు ఇచ్చామని చెప్పారు నిరంజన్ రెడ్డి.రైతులకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడతారు..కట్ట తెగిపోతే ముఖ్యమంత్రి మాకు ధైర్యం చెప్పారని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం లో సాగు సంబరంగా కొనసాగుతుంది…తెలంగాణ లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది…ఈ రోజు వరకు కోటి ఇరవై లక్షలకు ఎకరాలకు పైగా సాగు అయిందన్నారు.ఇంకో పదిలక్షలకు పైగా ఎకరాలు సాగు అయ్యే అవకాశం ఉంది…నియంత్రిత సాగు విజయవంతంగా కొనసాగుతుందన్నారు.రైతులందరికీ శుభాకాంక్షలు….వర్షాలు బాగా కురిశాయి.ప్రాజెక్ట్ లు ,చెరువులు నిండు కుండల్లా మారాయని తెలిపారు.

- Advertisement -