ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. శాసనసభలో సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్ లు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు నిరంజన్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ముందుచూపుతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అన్నారు.దేశంలో తలసరి వంటనూనెల వినియోగం సాలీనా 19 కిలోలు అన్నారు. దేశంలో 250 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల వినియోగం అవుతుండగా .. దేశంలో ఉత్పత్తి అవుతున్న వంటనూనెలు 130 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని…మిగిలిన వంటనూనెలు అన్నీ విదేశాల నుండి దిగుమతి అవుతున్నవన్నారు.1992 నుండి ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం మందకొడిగా సాగుతుందన్నారు.
వంటనూనెల్లో స్వయంపోషకం కావాలంటే దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాల్సి ఉందని…అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అన్నారు.తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 40 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు .. ఏడాదిలో లక్ష 18 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు .. నూతనంగా 2023 – 24లో 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం .. దీని కోసం రూ.750 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.ఎకరాకు రూ.50,918 చొప్పున సబ్సిడీ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుకు ప్లాంట్ మెటీరియల్, ఇంటర్ క్రాప్ – ఇన్ ఫుట్స్, బిందు సేద్యం కోసం అందించడం జరుగుతుందని…ఒక రైతుకు 12.5 ఎకరాల వరకే సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం పరిమితి విధించిందన్నారు.
Also Read:KTR:ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం