నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర విత్తానాభివృద్ధి సంస్థ 4వ వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తానాభివృద్ది సంస్థ ఛైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు హాజరైయ్యారు. ఇందులో భాగంగా టీఎస్ సీడ్స్ బ్రాండ్ లోగోని ఆవిష్కరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను కూడా ఒక విత్తన రైతునే. అన్ని రకాల సానుకులతలు ఉన్నందువల్ల ప్రపంచంలో వితనోత్పత్తిలో మనం మరింత ముందుకెళ్లాలి. ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి చేసే విధానానికి మంచి డిమాండ్ ఉంది. ఇతర దేశాలకు ఎగుమతి టార్గెట్ గా వితనోత్పత్తి చేయాలి. ప్రభుత్వ పరంగా నాణ్యమైన వితనోత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రాప్ కాలనీలతో బలోపేతమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనేది కేసీఆర్ ఆలోచన అన్నారు మంత్రి.
ముఖ్యంగా రైతులు మక్కజొన్న వితనోత్పత్తి పై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మక్కజొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పౌల్ట్రీ పరిశ్రమలో మక్కల వినియోగం ప్రధానమైనది. అలాగే మసాల దినుసులకు సంబందించిన వితనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి. ఉల్లి ధర పెరిగినందున హైదరాబాద్‌లో ఉల్లిపాయలు 11 సెంటర్లు పెట్టి అమ్ముతున్నాం. సబ్సిడీ మీద ఉల్లి వితనోత్పత్తి రైతులకు ప్రోత్సహం ఇస్తాం.అన్ని రకాల సానుకూలంగా ఉన్న తెలంగాణ నేలల్లో అద్భుతాలు సృష్టించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.