- Advertisement -
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేసి చూపించాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పంజాబ్‌లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతుందన్నారు. 75 ఏండ్ల కాలంలో రైతుబీమా గురించి ఏనాడైనా కాంగ్రెస్ ఆలోచించిందా అని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి… 2017లో పంజాబ్ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, అందుకే అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను ఈడ్చి తన్నారని మండిపడ్డారు.
దేశంలో అరాచక పాలనకు కాంగ్రెస్ దోహదపడిందని విమర్శించారు. ప్రతిపక్షంగా పోషించాల్సిన పాత్ర కాంగ్రెస్ పోషించడం లేదని చెప్పారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏనాడైనా కాంగ్రెస్ పోరాడిందా అని ప్రశ్నించారు.
- Advertisement -