వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోందని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుబంధు సమితిలు, రైతు నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం అని….అనతికాలంలోనే తెలంగాణ వ్యవసాయంలో అగ్రగామిగా ఎదిగిందన్నారు. దురదృష్టవశాత్తు దేశంలో ఒక గుడ్డి ప్రభుత్వం ఉందని…వారు రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ విజ్ఞప్తిని గమనించి రైతులు రైతులు వరి సాగును ఆపేశారని….12,600 తెలంగాణ గ్రామ పంచాయతీలు తెలంగాణ ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు పంపాయన్నారు. ఇంతచేసినా కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తోందని….కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం .. రైతాంగ అనుకూల ప్రభుత్వం కోసం తెలంగాణ రైతాంగం తెలంగాణ రైతులు బాటవేయాలన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో దేశ రైతాంగాన్ని జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.