తెలంగాణపై అవగాహనలేని బీజేపీ: నిరంజన్‌ రెడ్డి

62
niranjan reddy
- Advertisement -

తెలంగాణపై బీజేపీకి అవగాహనలేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయి అద్భుతంగా పురోగమిస్తున్నాం .. దేశంలో అనేక రంగాలలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకిందన్నారు. ఇంత అద్భుతంగా పురోగమిస్తుంటే ఒకనాడు బిడ్డను కని తల్లి చనిపోయిందన్నాడు .. ఇప్పుడు తలుపులు మూసి లైట్లు ఆర్పి బిల్లు ఆమోదించారు అంటున్నాడు…దమ్ముంటే విభజన చట్టం తప్పు అనుకుంటే చీము, నెత్తురు, రోషం ఉంటే దానికి ప్రత్యామ్నాయం పార్లమెంటులో పెట్టాలన్నారు.

మోడీది తెలంగాణ అభివృద్ది పట్ల ఒక ఈర్ష, ద్వేషం, ఒక అసూయ అని తెలిపిన నిరంజన్ రెడ్డి…ఒక్కటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగున పరిచి, ఏక వ్యక్తి పరిపాలన కింద ఏకవ్యక్తిగా చలామణి అవుతున్న మోడీ మోనార్క్ లా దేశాన్ని ఏలాలని అనుకుంటున్నాడని ఆరోపించారు. మోడీ రాచరికపు ఆలోచనా విధానానికి గండి కొట్టే సాహసం చేస్తున్నది ఒక్క కేసీఆర్…అందుకే తెలంగాణ మీద కసిబూని మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారు .. దానిని మరిచిపోయిన పాలకులు ప్రజల పాదాల ధూళికింద కలిసిపోతారని…దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రాలన్నీ పరిపాలనా సౌలభ్యం కోసమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులలో దేశంలో కలిసింది…బీజేపీ పార్టీకి తెలంగాణ మీద అవగాహన లేదన్నారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేశారు….అప్పటి నుండి తెలంగాణ అనేక రూపాలలో ఉద్యమాలు చేస్తూ బిడ్డలను కోల్పోతూ రక్తతర్పణం చేస్తూ వచ్చిందన్నారు.

- Advertisement -