” రైతు మార్గదర్శి ” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి

665
Rythu Margadarshi Book Launches
- Advertisement -

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్ల పై పూర్తి అవగాహన కలిగించాలనే సంకల్పంతో ” రైతు మార్గదర్శి ” పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి నిరంజన్ రెడ్డి. బేగంపేట హోటల్ హరిత ప్లాజాలో ఈ ఆకార్యక్రమం జరిగింది. అగ్రోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, ఆగ్రోస్ ఎం.డి సురేందర్ , వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Rythu Margadarshi Book Launches1

ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కొంత మంది కేంద్ర మంత్రులు మన రాష్ట్రానికి వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను పొగిడిన వాళ్లు..నిన్న వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నూతన రాష్ట్రంకు ఆర్ధికంగా సహాయం చేయడం రాదు కానీ ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసినందుకు కేంద్రంలోని పెద్దలు వచ్చి ప్రశంసించారని గుర్తు చేశారు.

రైతులకు సంబంధించి ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని పుస్తక రూపంలో తీసుకొచ్చిన లింగం పల్లి కిషన్ రావు ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని చెప్పారు.

రైతాంగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను. ఇప్పటికే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని పార్లమెంట్ లో మన ఎం.పి లు కోరడం జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు భీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మంది కి రైతు బంధు పథకాన్ని అందించినట్లు తెలిపారు.

ఆగ్రోస్ చైర్మన్ లింగం పల్లి కిషన్ రావు మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆగ్రోస్ ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలపై రైతు మార్గదర్శి పుస్తక ఆవిష్కరణ జరగడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్తు ఇస్తున్నారు..

కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యం తో మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు.

- Advertisement -