పుట్టినరోజున మొక్కలు నాటిన మంత్రి నిరంజన్ రెడ్డి..

22
minister niranjan reddy

సోమవారం తన పుట్టినరోజు సంధర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్క నాటారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.