ఈ గెలుపు పట్టభద్రులది: మంత్రి నిరంజన్ రెడ్డి

274
- Advertisement -

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ శాసనమండలి స్థానంలో సురభి వాణిదేవి విజయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గెలుపు పట్టభద్రులది, తెలంగాణ ప్రజలది. జాతీయ పార్టీలను తెలంగాణ తిరస్కరించిందన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చాటి చెప్పారు. కీలక సమయంలో మరోసారి టీఆర్ఎస్ వెంట నిలిచి మెజారిటీ అందించిన పాలమూరు పట్టభద్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

అప్పుడు తెలంగాణ సాధనలో, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి సాధనలో మీ ప్రోత్సాహం, అభిమానం మరవలేనిది. కేసీఆర్ పట్ల మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞులం. మీకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటాం. తెలంగాణ అభివృద్ధి తప్ప మాకు మరో ఆలోచన లేదన్నారు. వాణిదేవి గెలుపులో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. గెలుపు కోసం కృషిచేసిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయం సాధించారు.

- Advertisement -