ఆయిల్ పామ్ సబ్సిడీపై నిరాధార ఆరోపణలు..

28
niranjan reddy
- Advertisement -

ఆయిల్ పామ్ సబ్సిడీపై పలు పత్రికలలో వచ్చిన నిరాధారమైన వార్తలను రైతు సోదరులు పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆయిల్ పామ్ డిమాండ్ గమనించే ప్రభుత్వం ప్రోత్సాహం అందించిందన్నారు. రైతుకు అధిక ఆదాయం రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఇది రైతు ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలోని 26.81 లక్షల బోరు బావులకు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం మోస్తూ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం అన్నారు. ఏడాదికి రూ.1500 కోట్లు పెట్టి రైతుభీమా పథకం…ఏడాదికి రూ.15 వేల కోట్లతో 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈఓల నియామకం, మొత్తం 2601 రైతువేదికల నిర్మాణం చేపట్టామన్నారు.

ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపిన నిరంజన్ రెడ్డి…మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేసి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఏటా 23 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల డిమాండ్ ఉందని కానీ దేశంలో 10, 11 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెలు మాత్రమే దేశీయంగా లభిస్తున్నాయన్నారు. దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడుతున్నాం…ఈ డిమాండ్ ను గమనించే 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుందన్నారు. ఎవరైనా రైతులు రుణం తీసుకుని ఆయిల్ పామ్ సాగు చేస్తే వారికి చెందాల్సిన సబ్సిడీ వారి ఖాతాలలో జమ అవుతుంది. అది ఒక అప్షన్ గా మాత్రమే ఇస్తున్నామన్నారు.

- Advertisement -