సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పండిన ప్రతి గింజాను కొనుగోలు చేయాలని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ రోజు కోహెడ మార్కెట్ పనులను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుపు ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉన్నారు. కొద్దీ మంది అవగహన ఉండి లేక బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రైతుల పంట కొనుగోలు చేస్తా లేరు అని మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.
పంట కొనుగోలు చేసిన 5 రోజుల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఒకవేళ అకాల వర్షాల వలన ధాన్యం తడిసిన రంగు మారిన మా ప్రభుత్వమే కొంటుంది రైతులు ఎవ్వరు ఇబ్బందులు పడవద్దు. చాలా టార్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉన్నాయి. లేవు అనేది అవాస్తవం. ఎక్కడో ఒక్క దగ్గర కొంత ఇబ్బంది అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. అవాస్తవాలను చెప్పేవారు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది కొనేది కొనంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి లేకపోతే అబసు పాలవుతారని మంత్రి ఎద్దేవ చేశారు.
మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీ చేస్తున్నారు. వాళ్ళ లాగా ఇంట్లో ఉండటం లేదు. కరోన కష్టకాలంలో కూడా మా సీఎం కేసీఆర్ ,ప్రభుత్వం ముందుచూపుతో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాము. ప్రాజెక్ట్ ల నిర్మాణం చేయడంతో గతంలో కంటే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుంది. కాబట్టి దాని దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరు ఇబ్బందులు పడవద్దు అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.