యూరియా కేటాయింపుపై కేంద్రం సానుకూలం..

438
- Advertisement -

కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో ఆయన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి రబీకి ఎరువుల కేటాయింపుపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది మాన్ సూన్ ఆలస్యంగా ప్రారంభమైనా ఎక్కువ భూమి సాగులోకి వచ్చింది.కోటి 11 లక్షల ఎకరాలలో తెలంగాణలో పంటలు ఉన్నాయి. వరి కూడా ఎక్కువ సాగులోకి వచ్చింది. రబీ కోసం 7 లక్షల 70వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చామని మంత్రి తెలిపారు.

అందుకు కేంద్రం 7 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. మిగిలిన 70 వేల మెట్రిక్ టన్నులు కూడా ఇవ్వాలని అడిగితే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.అక్టోబర్‌లో లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. దాంతో పాటే మిగితాది కూడా పంపిస్తే రాష్ట్రంలో స్టోరేజ్ చేసుకుంటామని కేంద్రమంత్రికి వివరించామన్నారు నిరంజన్‌ రెడ్డి.

minister nirajan reddy

అలాగే రబీలో 8 లక్షల ఎకరాలలో అదనంగా సాగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాం.. దాన్ని దృష్టిలో ఉంచుకుని యూరియా కేటాయింపులు జరపాలని కోరాం. ఎంత అదనపు భూమి సాగులోకి వస్తుందన్న అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు.ఈ ఏడాది ఖరీప్ లో ఏకంగా 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం పెరిగింది.

అయినా కేంద్రంతో సమన్వయం చేసుకొని యూరియా కొరత లేకుండా చేశాం..కేవలం 7 కేంద్రాల్లోనే యూరియా పంపిణీలో ఆలస్యంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. షిప్‌ల ద్వారా దిగుమతి చేసుకునే 46 శాతం యూరియాలో సమయానికి 39 శాతం మాత్రమే చేరింది. మిగతావి షిప్‌లలో చేరే సరికి కొంత ఆలస్యమైంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదని మంత్రి నిరంజన్‌ రెడ్డి పెర్కొన్నారు.

- Advertisement -