తెలంగాణ ముఖచిత్రమే వ్యవసాయం- మంత్రి

433
- Advertisement -

హైదరాబాద్ టెస్కాబ్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. టెస్కాబ్ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు, వైస్ ఛైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘం ఎన్నికల్లో రాష్ట్ర రైతాంగం ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అలాగే టెస్కాబ్ చైర్మన్‌గా కొండూరి రవీందర్ రావు వైస్ చైర్మన్‌గా గొంగిడి మహేందర్రెడ్డి ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు ధన్యవాదాలు. కాగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.

niranjan reddy

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే వ్యవసాయం. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. రైతుబంధు, రైతు భీమా ద్వారా రైతును రాజును చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది అన్నారు. త్వరలోనే రైతు సమన్వయ సమితిల పేరు రైతుబంధు సమితులు గా మార్పు చేస్తాం. రైతాంగాన్ని అద్భుతమైన శక్తి గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని విధంగా రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయం, కరెంటు, ప్రాజెక్టులకు సంబంధించి ఏడాదికి రూ. 60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మన బడ్జెట్లో మూడో వంతు ఖర్చు పెట్టడం లేదు. కొత్త పాలక వర్గం సీఎం కేసీఆర్ స్పూర్తిని నిలబెట్టే విధంగా కృషి చేయాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -