రైతుల పేరుతో రాజకీయం వద్దు..

20
minister Niranjan Reddy
- Advertisement -

రైతుల పేరిట రాజకీయం వద్దు అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సూచించారు మంత్రి నిరంజన్ రెడ్డి. అకాలవర్షాలకు పంటనష్టంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖపై స్పందించారు. నాలుగేళ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారు ? అని ప్రశ్నించారు. అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుందన్నారు. అకాలవర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగిందని తెలిపారు.

వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తారని…సమస్యను ప్రభుత్వం దృష్టికి ఒక ప్రజాప్రతినిధిగా కోమటిరెడ్డి గాని మరొకరు గాని తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్ నాం చేయాలనే అలోచన సబబు కాదని..తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతుందన్నారు.

ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని..రైతుబంధు, రైతుభీమా, ఉచితకరంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి… దేశంలో సగటు ఉత్పత్తిలో ప్రథమ స్థాయి అన్నారు. తెలంగాణ వరి ధాన్యం కొనమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబితే ఒక్క కాంగ్రెస్ నేత ఎందుకు ప్రశ్నించలేదు ? ఎందుకు దీక్షలు చేయలేదు ? అని మండిపడ్డారు. అకాలవర్షాలతో వచ్చిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరం. మీ గత పాలనలో రైతుల పడ్డ గోస గుర్తు చేసుకోండని సూచించారు.

- Advertisement -