సకల హంగులతో కోహెడ మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ అని…199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం అన్నారు. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, కమీషన్ ఏజెంట్లు అందరికీ దుకాణాలు కేటాయిస్తామన్నారు.
Also Read:అతనికి చరణ్ ఛాన్స్ ఇచ్చాడా ?
16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపడతామని…11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్ ఉంటుందన్నారు. 56.54 ఎకరాల్లో రహదారులు,11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని ప్రారంభిస్తాం అన్నారు. ప్రణాళికను చూసి ఎమ్మెల్యేలు, మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిన తమన్నా