బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో మాట్లాడిన ఆయన..తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరం అన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో హామీలు తప్ప ఆచరణ లేదన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని దివాళా తీయించారు .. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారన్నారు. 2014, 2019 ఎన్నికల సమయంలో, పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
మద్దతుధరల పెంపు ఒక మాయ, వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు వట్టి మోసం అన్నారు. ఎరువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు….నోట్ల రద్దు, నల్లధనం వెనక్కి తేవడం, జీఎస్టీ అమలు వంటి విఫలయత్నాలతో దేశాన్ని దివాళా తీయించారన్నారు. గ్యాస్ ధరలు రెండింతలు పెంచి మోడీ సామాన్యుల నడ్డి విరిచారని….ఎనిమిదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిపారు అని వెల్లడించారు.
భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి ఒక నమూనాగా నిలుస్తుందని…దేశ ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు.