రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులు ముఖ్యమని..పార్టీలు కాదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. యూరియా కొరతకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు సెక్రటేరియట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియాకు సంబంధించిన కొరత లేదన్నారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియా పై ముందే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. దశల వారీగా వారు రాష్ట్రానికి యూరియా పంపిస్తున్నారని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో కొంత యూరియా కొరత ఉంది..అక్కడ మాత్రమే క్యూ లైన్లలో నిల్చుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొంత యూరియా సరఫరా చేస్తుంది . అయితే గతంలో స్టాక్ కొన్నప్పుడే సబ్సిడీ వచ్చేది అయితే ఇప్పుడు అలా లేదు పిఓఏస్ ద్వారా మాత్రమే యూరియా తీసుకునే వెసులుబాటు ఉంది .రైతు కొన్నప్పుడే సబ్సిడీ ఆమాంట్ వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల నుండి 8.5 లక్ష ల యూరియా కొరినం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు సరఫరా చేశాం. యూరియా సరఫరా విషయంలో ఎలాంటి అపోహలు వద్దు. రాజకీయ నాయకులు రైతన్నలను ఆగం చేదవద్దని చెప్పారు. వరదల కారణంగా సరఫరా కొంత లెట్ అయింది .ఇది మొత్తం దేశంలో ఉంది.రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం కేసీఆర్ కూడా సమీక్ష చేస్తున్నారని తెలిపారు.