- Advertisement -
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు తెలంగాణ కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి.
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలి.ఈ కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారిని ఆదుకోవాలి.చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా సామాజిక,భౌతిక దూరాన్ని పాటిస్తూ చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా 20వ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -