గురుకులాలను సందర్శించిన మంత్రులు..

165
Minister Sathyavathi Rathod
- Advertisement -

హైదరాబాద్‌లోని బోడుప్పల్, ఫిర్జాదీగూడ, జంగమ్మెట్ గిరిజన గురుకుల అర్బన్ అప్-గ్రేడెడ్ మహిళా కళాశాలను సందర్శించారు మంత్రులు సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

అన్నివర్గాల విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తుందని.. విద్యార్థులకు విద్యతోపాటు పోషకాహారం సైతం అందిస్తున్నట్లు చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో పాఠశాలల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు కావాల్సిన యూనిఫాం, దుస్తులను టెస్కో నుంచి తెప్పిస్తున్నాం.నిత్యావసరాలు, సబ్బులు, షాంపులు, కాస్మొటిక్స్ జీసీసీ నుంచి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో 10 నెలల తరువాత పాఠశాలలు తెరుచుకోవడంతో నిర్వహణ కోసం పాఠశాలకు రూ. 20 వేలు అందిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -