కార్మికుల సంక్షేమం కోసం 9 పథకాలు: మంత్రి మల్లారెడ్డి

442
minister mallareddy
- Advertisement -

రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం 9 పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి…భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌తో పాటు ఇత‌ర కార్మికుల సంక్షేమ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని తెలిపారు.

ఇప్పటివరకు 9,15,287 మంది కార్మికులు రిజిస్ర్టేష‌న్ చేసుకోగా వారికి 1,512 కోట్ల 85 ల‌క్ష‌ల 10 వేల 821 రూపాయాలు భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌తో పాటు ఇత‌ర కార్మికుల‌కు, వారి కుటుంబాలకు ఇచ్చామన్నారు.

గ‌తంలో కార్మికులు ప్రమాదవశాత్తు చేనిపోతే ప‌రిహారం రూ. 2 ల‌క్ష‌లు ఉండేదని దానిని రూ. 6 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. అంగ‌వైక‌ల్యం క‌లిగితే 2 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని 5 ల‌క్ష‌ల‌కు, స‌హ‌జ మ‌ర‌ణం చెందితే 30 వేల నుంచి 60 వేల‌కు, అంత్య‌క్రియ‌ల కోసం 5 వేల నుంచి 30 వేల వ‌ర‌కు, వివాహ కానుక‌, ప్ర‌సూతి సాయానికి 5 వేల నుంచి 30 వేల‌కు పెంచ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

- Advertisement -