ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలి..

200
Minister Malla Reddy On Corona
- Advertisement -

ఈ రోజు గుడ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కార్మిక,ఉపాధి,శిక్షణ,కార్మాగారముల,నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రి సి.హెచ్ మల్లా రెడ్డి 1500 మంది నిరుపేద ప్రజలకు ఒక్కో ఒక్కరికీ 10కేజీ ల బియ్యం పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయం. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అద్భుతమన్నారు మంత్రి.

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రతి ఒక్కరు పరిశుభ్రత, స్వీయనియంత్రణ పాటించాలి. సామజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలి. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరించి అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదాం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండండి అత్యవసరం అయితేనే బయటకి వెళ్ళండి అని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,వైస్ చైర్మన్ ప్రభాకర్,మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -