సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం- మంత్రి మల్లారెడ్డి

196
Minister Malla Reddy
- Advertisement -

మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన పలువురికి తమ వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చెక్కులను ఈరోజు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది. అందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం.ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది పేద ప్రజలు లబ్ది పొందుతున్నారు.పేద ప్రజలకు వరంలా మారింది ముఖ్యమంత్రి సహాయనిధి.(సి.ఎం.ఆర్.ఎఫ్) అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -