సెల్ఫీస్టార్.. కేటీఆర్

217
Minister KTR With Selfies
- Advertisement -

తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ తాను ఎంత బిజీగా ఉంటున్నా కూడా ట్రెండును ఫాలో కావడంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంత్రిగా కీలక సమావేశాలు, కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన అక్కడ సెల్ఫీలతో హల్ చల్ చేస్తూ సగటు యువకుడిలా మిగతా యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు. తెలంగాణలో కేటీఆర్ సెల్ఫీలు దుమ్ము రేపుతున్నాయి. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారని పేరున్న కేటీఆర్ ఇటీవల కాలంలో సెల్పీలతోనూ సందడి చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అక్కడి ప్రముఖలతో సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. నిత్యం టాలీవుడ్ కుర్ర హీరోలు, నటులతో సంభాషణలు సాగిస్తున్నారు. రాణా వంటి నటులైతే ఆయనకు మంచి స్నేహితులు.

Minister KTR With Selfies

నగరంలో ఆదివారం ఉదయం 10కే రన్‌ అట్టహాసంగా జరిగింది. నగరవాసులు 10కే రన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొని.. ఉత్సాహం పరిగెత్తారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతోపాటు పలువురు సెలబ్రిటీలు ఈ పరుగులో పాల్గొని.. ఆహూతుల్లో ఉత్సాహం నింపారు. 10కే రన్‌ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు సెలబ్రిటీలతో కలిసి దిగిన సెల్ఫీ హల్‌చల్‌ చేస్తోంది.

Minister KTR With Selfies

టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా, మెగాహీరో రాంచరణ్‌ తేజ, నటి రాశిఖన్నా, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్‌ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని సానియామీర్జా తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసుకున్నారు. నగరంలో నిర్వహిస్తున్న ఇలాంటి ఈవెంట్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి కేటీఆర్. క్రీడలు, ఆరోగ్యం పట్ల ప్రచారం కల్పించేందుకు ఇలాంటి పరుగులు మరిన్ని చేపట్టాలన్నారు. 10కె రన్‌లో సుమారు 10వేల మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన రామ్‌చరణ్‌, రాశిఖన్నాలను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. ఇలాంటి పరుగులో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. పరుగు ప్రారంభానికి ముందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి

Minister KTR With Selfies

కేటీఆర్ ఇలా యువ ప్రముఖులతో కలిసిపోవడం.. వారితో సోషల్ మీడియా వేదికగా సంభాషణలు జరుపుతుండడం వంటివన్నీ యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. కేటీఆర్ అంటే యువతలో క్రేజ్ పెరిగేలా చేస్తున్నాయి. మరోవైపు రాజకీయాలకు వచ్చేసరికి ఆయన ఎంతో అనుభవం ఉన్న నేతలా క్లిష్టమైన ఎన్నికలను కూడా ఒంటి చేత్తో పార్టీకి విజయం అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి కేటీఆర్ స్టైలే స్టైలు అంటున్నారు తెలంగాణ కుర్రకారు.

- Advertisement -