ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని…గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు #Ugadi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2023
తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..