ఓటు హ‌క్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌..

255
ktr
- Advertisement -

ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో హైద‌రాబాద్‌, షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగల, సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు.

ktr vote

ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయ‌న అన్నారు. ఆదివారం సెలవుదినమని ఇంట్లోనే ఉండ‌కూడ‌ద‌ని, ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

- Advertisement -