- Advertisement -
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు రోడ్డు మార్గాన సిరిసిల్ల చేరుకుని, అక్కడి పొదుపు భవన్‌లో కలెక్టర్‌తో పాటు ఆయా అధికారులతో కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల అభివృద్దిపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నూతనంగా నిర్మించిన తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం హైదరాబాద్ పయనం కానున్నారు.
- Advertisement -