మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

72
- Advertisement -

సోమవారం నారాయణపేట్ జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లాలోని సింగారం గ్రామంలో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ మరియు మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్‌ బండ్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -