నాగర్‌కర్నూల్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కల్వకుర్తి పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించార. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణ అభివృద్ధి మనందరి బాధ్యత. పారిశుధ్యం, పచ్చదనం, మంచినీరు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాం. పల్లె,పట్నాల అభివృద్ధి కోసమే అడిషనల్ కలెక్టర్లు నియమించాము. అడిషనల్ కలెక్టర్ మనూ కల్వకుర్తి కౌన్సిలర్లని తీసుకు రావాలి. పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులు తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి. ఈ తడి,పొడి చెత్త సేకరణతో సిరిసిల్లలో రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.. సిరిసిల్లకు వస్తే దీనిపై అవగాహన కలుగుతుంది. అని మంత్రి అన్నారు.
ఖాళీ స్థలాలు, రోడ్లపై చెత్త వేయరాదు. జపాన్, సింగపూర్ లో రోడ్లపై చెత్త వేయరు. ఇప్పటి వరకు ఒకలెక్క…ఇప్పటిసంది పద్దతులు మార్చుకుందాం. చెత్తతో దోమలు, పందులు, కుక్కల బెడద ఎక్కవ ఉంటది. ఖాళి జాగాలు ఉన్న స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. అలాగే పట్టణంలో ఉన్న శిథిల భవనాలను తొలగించాలి. రెండు నెలలకు సరిపడా మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చాయి. ప్రతి పట్టణంలో వార్డు, పట్టణ ప్రణాళికలను రూపొందించుకోవాలి. అలాగే పారిశుధ్య, హరిత ప్రణాళిక తయారు చేసుకోవాలి. మొక్కలు లేక వాతావరణ అసమతుల్యత ఏర్పడుతోంది. చలికాలం ఎప్పుడు ఉంటుందో తెలియదు.. ఎండాకాలంలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో వన నర్సరీలు ఉన్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ. అన్నారు.
రూ.వేలకోట్లతో ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.. మిషన్ భగీరథ నీళ్లను తాగుదాం ఖర్చు తక్కువ… ఆరోగ్య రక్షణ ఎక్కువ. అన్నీ ఒక్కరోజులో సాధ్యం కావు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ధాం.అల్లాఉద్దీన్ అద్భుత దీపం వెంటలేదు. ఈ కార్యక్రమంతో పది రోజుల్లో ఏదో చేస్తామని చెప్పడం లేదు. రాబోయే ఆరు నెలల్లో ఓ కొలిక్కి తెద్దాం.ప్రతీ నగరంలో పబ్లిక్ టాయ్ లెట్లు నిర్మించాలి.కాలనీల్లో వంగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను సరిచేయాలి అని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.