కరోనా వైరస్‌కు నియంత్రణ నే మందు-కేటీఆర్‌

233
ktr
ktr
- Advertisement -

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అకస్మికంగా పర్యటించారు. వేములవాడలోని సుభాష్‌నగర్‌ ఏరియాలో కంటైన్‌మెంట్‌ జోన్లను కేటీఆర్‌ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై పోలీసులకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా వైరస్ ను తట్టుకోలేకపోయింది..అక్కడ శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది అన్నారు మంత్రి కేటీఆర్.

కరోనా వైరస్‌కు నియంత్రణ నే మందు. కరోనా సోకకుండా జిల్లా యంత్రాంగం అప్రత్తమైంది. ఇప్పటి వరకు జిల్లాలో ఓకే పాసిటివ్ కేసు నమోదైంది. జిల్లాలో మళ్లీ కొత్త కేసు నమోదు కావద్దని మంత్రి కోరారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. తెలంగాణ దేశానికే అన్నపూర్ణ.. ఎండాకాలంలో కూడా మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

పల్లెల్లో భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ పట్టణాలలో యువత పాటించడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరించాలి.. లేని యెడల చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లాక్ డౌన్ కు రాబోయే మరో రెండు వారాలు ప్రజలు సహకరించాలి. మీ సహకారంతో త్వరలో తెలంగాణను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించుకుందామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -