బాలుడి ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా..

192
ktr
- Advertisement -

బాలుడి ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఓ బాలుడు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో ప‌ల్టీలు కొడుతూ దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజ‌న్ తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, వి.శ్రీనివాస్ గౌడ్‌ల‌కు ట్వీట్ చేశాడు. అయితే ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆ బాలుడి టాలెంట్ ప‌ట్ల కేటీఆర్ ఫిదా అయ్యారు.

ఆ బాలుడికి అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, ఇది త‌న సండే మోటివేష‌న్ గిఫ్ట్ అని నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఈ వీడియోనే రీట్వీట్ చేసిన కేటీఆర్‌… ‘వావ్ ఒలింపిక్ మెడ‌లిస్ట్ త‌యార‌వుతున్నాడు. అత‌డు తెలంగాణ బాలుడా? లేక దేశంలోని ఇత‌ర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నాను’ అని.. అత‌డి గురించి వివ‌రాలు తెల‌పాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -