విస్తృతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు: కేటీఆర్

133
- Advertisement -

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా సాగుతోందన్నారు మంత్రి కేటీఆర్. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు ఇంచార్జిలతో జరిగిన ఈ టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ నిర్ణయించుకున్న లక్ష్యం మించి సభ్యత్వ నమోదు విజయవంతం కాబోతుందన్నారు.

ఈ నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు తోపాటు, మెంబర్షిప్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని సైతం సమాంతరంగా కొనసాగించాలని ఇన్చార్జిల కి కేటీఆర్ సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు పైన జిల్లాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు కి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు పార్టీ నాయకులు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నిర్ధారిత లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు కొనసాగుతున్న విషయాన్ని తెలిపారు పార్టీ నాయకుల. పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులంతా కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న తీరు పైన సంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్.

- Advertisement -