ప్రజలకు సేవలు చేయడమే ఆయన లక్ష్యంః మంత్రి కేటీఆర్

593
KTRBANSWADA
- Advertisement -

నిరంతరం ప్రజలకు సేవలు అందించడమే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష్యం అన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. బాన్సువాడ నియోజకవర్గంలో రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బాన్సుబాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ది చేశారన్నారు.

KTRBANSWADA

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ నిత్య విద్యార్థి. నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా స్పీకర్ పోచారం పనిచేస్తారు. సొంత పనులు చేసినంత శ్రద్ధగా స్పీకర్ పోచారం బాన్సువాడను అభివృద్ధి చేస్తున్నారని’ కేటీఆర్ అన్నారు. నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గృహ నిర్మాణానికి పట్టణంలో రూ.5.30లక్షలు, గ్రామాల్లో రూ.5లక్షలు ఇస్తున్నారని పేర్కొన్నారు. బాన్సువాడలో ఏ ఒక్క కుటుంబం కూడా కిరాయి ఉండకుండా నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు.

- Advertisement -