హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి- కేటీఆర్‌

54
ktr minister
- Advertisement -

హైదరాబాద్‌ నగరం ఒక ఐటీలోనే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో రెండు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.. ష్యూరిఫై ల్యాబ్స్‌ టెక్నాలజీ, కొలియర్‌ల నూతన కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆఫీస్‌ స్పేస్‌ లీజు విషయంలో హైదరాబాద్‌ నగరం బెంగుళూరును దాటిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే పోటీ అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణ సృష్టి, వ్యాపార అనుకూల విధానాలను నిరంతరం కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

హైదరాబాద్‌ నగరం ఒక ఐటీలోనే కాకుండా అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. ఐటీతోపాటు జీవశాస్త్రాలు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తదితర రంగాల్లో ఎంతగానో పురోగతి సాధించినట్లు చెప్పారు. ప్రభుత్వ పరంగా పరిశ్రమలు, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నట్లు, ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో, అంతే వేగంగా తాము అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నేడు విద్యుత్‌ కోతలు లేవని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతీ కంపెనీకి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -