భవిష్యత్‌ తరాల బాగుకోసమే హరితహారం: కేటీఆర్

42
ktr

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లు అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…ఇంత కష్టకాలంలో 57 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామన్నారు.

500 మంది జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కొత్తగా వీర్నపల్లి మండలం ఏర్పాటు కావడంతో గ్రామాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి తప్పింది. ఆర్థిక, దూర భారం తగ్గిందన్నారు.

పోడు భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని వెల్లడించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రీయ దృక్పథంతో నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు.

రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్తు తరాలు బాగుపడాలనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి రావొద్దని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారానికి పూనుకున్నదని పేర్కొన్నారు.