ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం- కేటీఆర్‌

494
minister ktr
- Advertisement -

ఈ రోజు ముంబయిలో నాస్కామ్‌ టెక్నాలజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఫోరమ్‌ 28వ సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రాలకు సహకరించడం లేదని.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా తక్కువగా ఉందని కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణలో అమలు అవుతున్న పలు పథకాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబందు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయి. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. 24 గంటల కరెంటు ఇస్తూ తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చామని ఆయన తెలిపారు. మిషన్‌ భగీతథ పథకంతో ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నామని కేటీఆర్‌ వివరించారు.

అంతే కాకుండా తెలంగాణ పరిశ్రమలకు ఎంతో అనువైన రాష్టంగా అని ఇదివరకే రాష్ట్రానికి పలు భారీ కంపెనీలు వచ్చాయని తెలిపారు. అలాగే ఐటీ పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించామని చెప్పారు. టెక్‌ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీలు వరంగల్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాక్లస్టర్‌ 19 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టైక్స్‌టైల్స్‌ పార్క్‌ దేశంలోనే పెద్దది అని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -