అధికారికంగా అల్లూరి జ‌యంతి వేడుక‌లు: కేటీఆర్

48
ktr minister
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌న్యం వీరుడి జ‌యంతి వేడుక‌ల‌ను అధికారికంగా నిర్వ‌హిస్తుంద‌న్నారు మంత్రి కేటీఆర్. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్…వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని.. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. జ‌ల్ జంగల్‌ జమీన్‌ నినాదంతో కుమ్రం భీమ్‌ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు.

నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్‌ కేటాయించారని తెలిపారు. తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరాటంసలిపారని…ఆ స్పూర్తితో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.

- Advertisement -