వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ..

494
ktr speech
- Advertisement -

ఈ రోజు హైద్రబాద్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సదస్సులో మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

minister ktr

అలాగే టీహబ్‌ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌. హార్డ్‌వేర్‌ స్టార్టప్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని’.. ‘టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్‌ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్‌ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ktr at US India Defence Ties Conference

25 ఏరోస్పేస్‌ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. బోయింగ్‌ లాంటి సంస్థలు నగరంలో ఉన్నాయి. ఆదిబట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాం. వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -