తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కిషన్ రెడ్డిని తాను సోదరుడిగా గౌరవిస్తానని కానీ తప్పుడు సమాచారం ఇచ్చే దురదృష్టకర కేంద్రమంత్రిని చూడలేదన్నారు. 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారని…ఈ విషయంలో ఆయకు క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదన్నారు.
గుజరాత్ బాసులను సంతోషపెట్టడానికి అర్ధ సత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తిగా కిషన్ రెడ్డి మారారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. కానీ దాన్ని గుజరాత్‌కు తరలించారని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని నిప్పులు చెరిగారు.