కాంగ్రెస్,బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల: కేటీఆర్ విమర్శ

117
ktr
- Advertisement -

హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో నిలిచారన్నారు మంత్రి కేటీఆర్. హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్..దశాబ్దాల తెలంగాణ కలను టిఆర్ఎస్ సాకారం చేసిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించాం అన్నారు.

14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తి గా తెలంగాణ తీర్చి దిద్దాం అన్నారు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న…. తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమిచాం అన్నారు. స్వ రాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలనతో పరిపాలన సంస్కరణల తో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు పాలనకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నార అంటే… తెలంగాణ పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారు…వీరందర్నీ పార్టీ రంగు గులాబి దుస్తులు ధరించి రావాలని కోరుతున్నాం అన్నారు. తెలంగాణలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు.. ఉదయమే తమ ప్రయాణాన్ని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్‌కి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు.

ప్లీనరీకి వచ్చే ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు మంత్రులు ప్రజాప్రతినిధుల కు వచ్చే సహాయకులు మరియు ప్లీనరీ ఏర్పాట్లు కోసం పనిచేసే పోలీస్, జిహెచ్ఎంసి వంటి ఇతర ప్రభుత్వ సిబ్బంది సైతం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్లను పార్టీ పూర్తి చేసిందన్నారు.

గతంలో ఏ విధంగా అయితే కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో చీకటి ఒప్పందం తో పోటీ చేశాయో… అదేవిధంగా ఈరోజు హుజూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు… మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపికి ఓటు వేయమని ఎలా మాట్లాడుతారన్నారు.రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఎన్ని లోపాయికారీ ఒప్పందాలు చేసిన… కుట్రలు చేసిన విజ్ఞులయిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారన్నారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీకటి ఒప్పందాలు చేసిన… టిఆర్ఎస్ పార్టీకి చెందిన గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారన్నారు. గాంధీభవన్ లో గాడ్సేలును దూరారని రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

- Advertisement -