ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి- కేటీఆర్

213
ktr
- Advertisement -

1908లో మూసి వరదలు..1916 మళ్ళీ వర్షాలు కురిసినట్లు చరిత్ర చెప్తోంది. 1908 తరువాత మళ్ళీ 2020లో అసాధారణ వర్షపాతం నమోదు అయిందని మున్సిపల్ మంత్రి ,టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామా రావు తెలిపారు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదాలు చెరువు- నాళాలు కబ్జాలు చేయడం వల్ల నగరం మునిగిందన్నారు. దశాబ్దాల తరువాత అసాధారణ వర్షం కురిస్తే సీఎం ముందుచూపుతో ప్రాణనష్టం నివారించగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో 8వందల మంది పనిచేస్తోంది. తక్షణ ఉపశమనం- శాశ్వత పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు.

హైదరాబాద్ నగరంలో కురిసిన అసాధారణ వర్షానికి సీఎం తక్షిణసహయం కింద 550 కోట్లు సీఎం ప్రకటించారు. 50 కోట్లు రిపేర్ల కోసం,500 కోట్లు కుటుంబాలకు సహాయం ఇస్తున్నాము. 4లక్షల 30వేల కుటుంబాలకు ఇప్పటి వరకు తక్షణ సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఎలాంటి బేధాలు లేకుండా నష్టపోయిన కుటుంబాలకు మాత్రమే తక్షిణసహయం అందించాము. మేము వరద సహాయం చేస్తుంటే కాంగ్రెస్-బీజేపీ బురద రాజకీయం చేస్తున్నారు. మేము పుట్టెడు దుఖంలో ఉన్న ప్రజలకు అండగా ఉంటే.. కాంగ్రెస్ బీజేపీ దుబ్బాక రాజకీయం చేసాయని మంత్రి మండిపడ్డారు.

వరదలు వచ్చినప్పుడు ఎవ్వరూ ప్రజల్లో లేరు- ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. జోనల్ కమిషనర్ ఆఫీస్ లకు వెళ్లి అధికారులను బెదిరించినట్లు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 15వ తేదీ అక్టోబర్ 8వేల కోట్లు వరదల వల్ల నష్టం జరిగిందని లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. కర్ణాటక సీఎం ఉత్తరం రాయగానే నాలుగు రోజుల్లో పీఎం 665 కోట్లు విడుదల చేశారు. అలాగే గుజరాత్ కు ప్రధాని స్వయంగా వెళ్లి 5వందల కోట్లు విడుదల చేసారు. మరి తెలంగాణలో బీజేపీ కి 4గురు ఎంపీలు ఉన్నారు.. ఒక్క పైసా తెలీదు మన నగరం మన బీజేపీ అంటుర్రు అని మంత్రి ఎద్దేవ చేశారు.

ఆరేళ్లలో 2లక్షల 72వేలు కడితే 1లక్ష 40వేలు హక్కుగా తెలంగాణకు వచ్చాయి! కిషన్ రెడ్డి హోమ్ సహాయమంత్రి నిస్సహాయంగా ఉన్నారు ఎందుకు? ప్రభుత్వం పైసలు ఇస్తే తీసుకొని మళ్ళీ తెల్లారే ధర్నాలు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. నాళాలుపై 28వేల ఆక్రమణలు ఉన్నాయి అని కింలోస్కర్ కమిటీ ఆనాడే చెప్పింది. జీహెచ్‌ఎంసీలో బస్తీల్లో ప్రజలకు సుస్తీ చేస్తే దవాఖాన ఉండేదా? కనీసం టాయిలెట్స్ కట్టారా? అని మంత్రి ప్రశ్నించారు. ఇన్ని రోజులు ప్రతిపక్షాల మాటలు విని భరించాం ఇంక భరించలేము. ఇంకా వరద భాదితులు మిగిలితే నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. ప్రజలు ఇంట్లోనే ఉండండి ఇంటికి వచ్చి అధికారులు తక్షిణసహయం అందిస్తారు. స్టేటజిక్ నాలా అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో అమలు జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -