అంతా అదానీ అకౌంట్‌లోకే..మోడీపై కేటీఆర్‌ సెటైర్!

228
modi
- Advertisement -

ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు గౌతమ్ అదానీ. సీఈవో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. ఈ అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ట్వీట్ చేశారు. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 10.9 లక్షల కోట్లు. గత ఫిబ్రవరిలో ఆయన సంపద రూ.6.6 లక్షల కోట్లు మాత్రమే. దేశం అభివృద్ధి చెందట్లేదని ఎవరన్నారు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

దీనికి రిప్లై ఇచ్చారు కేటీఆర్. ప్రతి పేదవాడి అకౌంట్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని మోదీ ప్రామిస్ చేశారు. అయితే, ఆ డబ్బంతా ఒక్క అకౌంట్లోనే డిపాజిట్ అయ్యుండొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కానీ గౌతమ్ అదానీ సంపద మాత్రం పెరిగిందన్నారు.

- Advertisement -