టీఆర్‌ఎస్‌ శ్రేణులందరికీ ధన్యవాదాలు- మంత్రి కేటీఆర్

85
minister ktr
- Advertisement -

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రతి గ్రామం వార్డుల్లో బస్తీల్లో ఉత్సాహంగా పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈరోజు విజయవంతంగా ముగిసిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మన అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు మన పార్టీని, ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ ప్లీనరీ సమావేశం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -