భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర

414
Ktr
- Advertisement -

భవిష్యత్ తెలంగాణలో ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర అన్నారు మంత్రి కేటీఆర్. పట్టణాభివృద్ధి సంస్థలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం పట్టణాభివృద్ది సంస్ధలు ప్రణాళిక బద్ద ప్రగతి పట్టణాభివృద్ది సంస్ధలతోనే సాద్యమన్నారు.

విష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయడం పట్టణాభివృద్ది సంస్ధల ప్రాథమిక విధి అని, ఈ దిశగా అన్ని పట్టణాభివృద్ది సంస్ధలు కార్యచరణ ప్రారంభించాలని కోరారు. పట్టణ అవసరాలకు అవసరం అయిన గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ లాంటి జోనింగ్ ల ఏర్పాటు అయా పట్టణాల్లోని చెరువులు, సరస్సుల వంటి నీటి వనరుల రక్షణ, సబర్బన్ ప్రాంతాల అభివృద్ది లాంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకోవాలన్నారు. వరంగల్ పట్టణాభివృద్ది సంస్ధ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్దంగా ఉన్నదని మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ది సంస్ధల అంతిమంగా స్వయం సమృద్ది సాధించే దిశగా పనిచేయాలని, ఇందుకోసం ల్యాండ్ పూలింగ్- అభివృద్ది విధానంలాంటి మార్గాలను అనుసరించాలన్నారు.

- Advertisement -