పారిశుద్ద్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష

513
ktr
- Advertisement -

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని సెక్రటెరియట్ లో పారిశుద్ద్య నిర్వహణపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో పారిశుద్ద్య నిర్వహణపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు ఉండాలి.

పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించాలి. డంపింగ్‌ యార్డుల కోసం వెంటనే భూసేకరణ చేపట్టాలి. నగరాల్లో మరిన్ని షీ-టాయిలెట్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పట్టణంలో డంప్ యార్డ్ లు, డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్ల, మానవ వ్యర్ధాల నిర్వహాణ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో తడి-పొడి చెత్త సేకరణపైన ప్రత్యేక దృష్టి చేపట్టాలి. డంప్ యార్డులు లేని చోట్ల భూసేకరణకు వెంటనే చర్యలు చేపట్టాలని అదేశాలు జారీ చేశారు. ప్రతి పట్టణానికి ఒక డంప్ యార్డ్ ఉండాలని, డంప్ యార్డ్ లేని చోట దానికోసం స్ధల సేకరణలు కలెక్టర్లు వేంటనే చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డిఅర్ సిసి) ఏర్పాటు చేయాలన్నారు.

కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన వాటిల్లోనూ ఒడియఫ్ సాధించేలా చూడాలన్నారు. ప్రతి పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహాణపైన దృష్టి సారించాలని, అవసరం అయిన చోట్ల మరిన్ని నిర్మాణం చేయాలన్నారు. దీంతోపాటు ప్రతి నగరంలో మహిళల కోసం ప్రత్యేక షీ-టాయిలెట్స్ నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని టాయిలెట్స్ ని ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఈమేరకు వాటి యజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

నూతన పురపాలక చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఈ చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలిక బడ్జెట్ లో 10శాతం ఈ గ్రీన్ బడ్జెట్ కు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసుకోలన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ టీ.కె శ్రీదేవి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ దానకిశోర్ పాల్గొన్నారు.

- Advertisement -